ప్రభాస్ నన్ను దూరం పెట్టాడనేది పుకారే: ప్రభాస్ శ్రీను

26-09-2022 Mon 10:44
  • కమెడియన్ గా ప్రభాస్ శ్రీనుకి పేరు 
  • మొదటి నుంచి ప్రభాస్ తో సాన్నిహిత్యం 
  • పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ 
  • అయినా తమ మధ్య అదే ఫ్రెండ్షిప్ ఉందన్న శ్రీను  
Prabhas Srinu Interview
తెలుగులోని కమెడియన్స్ లో ప్రభాస్ శ్రీను ఒకరు. సినిమాల్లోకి రావడానికి ముందు నుంచి ప్రభాస్ తో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉండటం వలన, ప్రభాస్ శ్రీను అనే పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా విలన్ గ్యాంగ్ లో రౌడీగా కనిపిస్తూ వచ్చిన ఆయన ఆ తరువాత కమెడియన్ గా బిజీ అయ్యాడు. తాజాగా 'సుమన్ టీవీ' ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.

"సత్యానంద్ గారి ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకునే రోజుల నుంచి ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన ఎప్పటికైనా పెద్ద స్టార్ అవుతాడని నేను అప్పుడే అనుకున్నాను. వేరే సినిమాతో బిజీగా ఉండటం వలన, ఆయన 'ఈశ్వర్' సినిమాలో చేయలేకపోయాను. ఆ తరువాత ఆయనతో కలిసి నటించాను. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ, నాతో అంతే చనువుతో ఉంటాడు. స్టార్ డమ్ ను బట్టి మారాలనే విషయం ఆయనకి తెలియదు. 

ప్రభాస్ నన్ను దూరం పెట్టినట్టుగా ప్రచారం జరిగింది. కానీ అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఆయనతో గొడవపడి విడిపోవాలని నాలాంటి వారు అనుకోరు. ఇవన్నీ కూడా పనిలేని వాళ్లు సృష్టించే పుకార్లు. అప్పుడు .. ఇప్పుడు అనే కాదు ప్రభాస్ ఎప్పటికీ మారడు. ఇక కెరియర్ ను పెద్ద సీరియస్ గా తీసుకోని నన్ను సరైనా మార్గంలో పెట్టింది మాత్రం బ్రహ్మానందం గారు. ఆయన మాటలనే ఇప్పటికీ అనుసరిస్తున్నాను" అంటూ చెప్ప్పుకొచ్చాడు.