ఐఫోన్ 13 128జీబీ మోడల్ స్టాక్ లో కనిపించడం లేదు..!

  • ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పోర్టళ్లలో అమ్ముడు పోయిన పూర్తి స్టాక్
  • అదనపు స్టాక్ ను తీసుకురాని యాపిల్
  • అధిక ధరల వేరియంట్ల విక్రయాలపై దృష్టి
iPhone 13 128GB model goes out of stock on Amazon and Flipkart what is the reason

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కార్యక్రమాల్లో ఐఫోన్ 13 128జీబీ స్టోరేజీ మోడల్ కొనుగోలు చేద్దామని అనుకున్న వారి కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఫోన్ స్టాక్ లో కనిపించడం లేదు. ఈ ఫోన్ పై భారీ తగ్గింపు వల్ల హాట్ కేకుల మాదిరిగా ఉన్న స్టాక్ అంతా అయిపోయింది.  అయినా యాపిల్ కొత్త స్టాక్ ను అందుబాటులోకి తీసుకురావడం లేదు. దీంతో దీన్ని కొనుగోలు చేద్దామని అనుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది.

ఐఫోన్ 13 128జీబీ మోడల్ ను ఈ రెండు ఈ కామర్స్ సంస్థలు రూ.46,990కే ఆఫర్ చేశాయి. దీంతో యాపిల్ అభిమానులు వెంటనే ఆఫర్ ను పూర్తిగా వినియోగించేసుకున్నారు. దీంతో ఐఫోన్ బేస్ మోడల్ అందుబాటులో లేకుండా పోయింది. దీన్నిస్టాక్ లోకి తీసుకొస్తే హైఎండ్ మోడల్స్ విక్రయాలపై ప్రభావం పడుతుందని యాపిల్ భావించినట్టుంది. కొత్త స్టాక్ తీసుకురావడం లేదు. ఐఫోన్ 13 256జీబీ వేరియంట్ ధర రూ.66,990. డిస్కౌంట్ తర్వాత ధర ఇది. 512జీబీ ధర రూ.86,990. అమెజాన్ ప్లాట్ ఫామ్ పై ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 11 అందుబాటులో ఉన్నాయి. వీటిపైనా మంచి ఆఫర్లు నడుస్తున్నాయి. 

More Telugu News