నేను .. చైతూ ఈ రోజున కాలర్ ఎగరేస్తున్నాం: అఖిల్

  • ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'ది ఘోస్ట్'
  • వేదికగా మారిన కర్నూలు 
  • భారీస్థాయిలో తరలి వచ్చిన అభిమానులు 
  • నాన్నకి ఆకలి తగ్గలేదన్న అఖిల్  
The Ghost movie  Pre Release Event

విలేజ్ నేపథ్యంతో కూడిన కథతో 'బంగార్రాజు' సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున, అందుకు పూర్తి భిన్నమైన యాక్షన్ కంటెంట్ తో 'ది ఘోస్ట్' సినిమా చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 5వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూలులో నిర్వహించారు. 

భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో అఖిల్ మాట్లాడుతూ .. "ఇందాకటి నుంచి చూస్తున్నాను.. మీ ఎనర్జీ అదిరిపోయింది. నేను .. చైతూ ఇద్దరం కూడా ఈ రోజున కాలర్ ఎగరేస్తున్నాం. ఇంతకాలమైనా నాన్నను అదే ఫైర్ తో చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఏదైతే కోరుకున్నానో అదే ఈ సినిమాలో కనిపిస్తోంది. నాన్నని చూసి ఈయనకి ఇంకా ప్యాషన్ తగ్గదా? ఆకలి తగ్గదా? అనే నేను చైతూ మాట్లాడుకున్నాము. 

30 ఏళ్ల తరువాత కూడా ఆయన అదే క్రమశిక్షణతో పనిచేస్తూ వెళ్లడం చూస్తే, మా మోటివేషన్ .. ధైర్యం ఇంట్లోనే ఉందనే విషయం అర్థమైంది. మేము ఎంతలా పరిగెత్తాలనేది ఆయన చేసి చూపిస్తున్నారు. 'ఘోస్ట్' సినిమాలో ఒక ఫైర్ ఉంది .. అది ఏ స్థాయిలో ఉందనేది మనం అక్టోబర్ 5న చూడబోతున్నాం' అంటూ చెప్పుకొచ్చాడు.  


More Telugu News