Firefox: ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో బగ్ ఉంది... అప్ డేట్ చేసుకోండి: యూజర్లకు కేంద్రం హెచ్చరిక

  • ఫైర్ ఫాక్స్ పాత వెర్షన్లలో లోపం
  • హ్యాకర్ల పని సులువు చేసే బగ్
  • యూజర్ల సమాచారానికి ముప్పు
  • కొత్త వెర్షన్ వివరాలు తెలిపిన మొజిల్లా
CERT alerts users abourt bug in Firefox browser

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లు అత్యధికంగా ఉపయోగించే బ్రౌజర్లలో ఫైర్ ఫాక్స్ ఒకటి. అయితే, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో బగ్ ను గుర్తించినట్టు భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఈఆర్టీ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) వెల్లడించింది. యూజర్లు వెంటనే తమ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. 

ఈ బగ్ ద్వారా యూజర్ల డేటా హ్యాకర్ల పాలవుతుందని, డేటాను దొంగిలించడం ఎంతో సులువు అవుతుందని సీఈఆర్టీ హెచ్చరించింది. ఆర్బిటరీ కోడ్ ను సైబర్ నేరగాళ్లు కంప్యూటర్ లోకి ప్రవేశపెట్టేందుకు ఈ బగ్ వీలు కల్పిస్తుందని, తద్వారా యూజర్ల పాస్ వర్డ్ లు, వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక డేటా హ్యాకర్లకు చేరుతుందని వివరించింది. 

ఈ నేపథ్యంలో, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ సృష్టికర్త మొజిల్లా కూడా స్పందించింది. వెంటనే తన యూజర్లను అప్రమత్తం చేసింది. ఫైర్ ఫాక్స్ 105, ఈఎస్సార్ వెర్షన్లు వాడుతున్న వారు 102.3 వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని మొజిల్లా సూచించింది. ఈ సరికొత్త వెర్షన్ ఫైర్ ఫాక్స్ సెక్యూరిటీ పేజిలోనూ, సీఈఆర్టీ-ఇన్ వెబ్ సైట్ నుంచి కానీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

More Telugu News