రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియా ఎవరి వైపు అని అడుగుతున్నారు... మా సమాధానం ఇదే: విదేశాంగ మంత్రి జైశంకర్

25-09-2022 Sun 15:37
  • ఇండియా శాంతి వైపే ఉంటుందన్న జైశంకర్
  • ఐక్యరాజ్యసమితి గౌరవాన్ని కాపాడే వైపు ఉంటామని వ్యాఖ్య
  • ఉద్రిక్త పరిస్థితుల్లో సైతం మానవ హక్కులకు గౌరవించాలి
India will peace side says Jai Shankar
అంతర్జాతీయ వేదికలపై ఈ వారం అత్యధికంగా రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపైనే చర్చ జరిగింది. మరోవైపు ఐక్యరాజ్యసమితిలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ... రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియా ఎవరివైపు అని అందరూ అడుగుతున్నారని... ప్రతిసారి తాము చాలా నిజాయతీగా సమాధానాన్ని ఇస్తున్నామని... తాము శాంతివైపే ఉంటామని, ఇదే విషయాన్ని ప్రతిసారి చెపుతున్నామని తెలిపారు. ఐక్యరాజ్యసమితి గౌరవాన్ని కాపాడే వైపు తాము ఉంటామని చెప్పారు. 

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడానికి ముందు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో జైశంకర్ మాట్లాడారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారంపై తాము చర్చించామని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. ఉక్రెయిన్ యుద్దం, జీ20, ఐక్యరాజ్యసమితి సంస్కరణలపై అభిప్రాయాలను పంచుకున్నామని చెప్పారు. ఉద్రిక్త పరిస్థితుల్లో సైతం మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని... వాటిని ఉల్లంఘించడం సరికాదని జైశంకర్ చెప్పారు.