సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న నాగార్జున 'ది ఘోస్ట్'

  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్'
  • యాక్షన్ మూవీ చేసిన నాగార్జున
  • U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
  • అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు 'ది ఘోస్ట్'
Nagarjuna starred The Ghost movie completes censorship

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న హైఓల్టేజ్ యాక్షన్ మూవీ 'ది ఘోస్ట్' సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. 

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ఘోస్ట్' చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోని యాక్షన్ దృశ్యాలు హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఉన్నాయన్న టాక్ వినిపించింది. 

కాగా, ఈసారి దసరా సీజన్ కు సీనియర్ హీరోల చిత్రాలు సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రం కూడా అక్టోబరు 5నే గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

More Telugu News