Rashmika Mandanna: ప్రముఖ డాక్టర్ ను కలిసిన రష్మిక మందన్న.. కారణం ఇదే!

Rashmika Mandanna meets Doctor
  • మోకాలి నొప్పితో బాధపడుతున్న రష్మిక
  • డాక్టర్ గురువారెడ్డిని కలిసిన వైనం
  • కంగారు పడాల్సిన అవసరం లేదన్న డాక్టర్
'పుష్ప' సినిమాతో ఘన విజయం అందుకున్న రష్మిక మందన్న బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంటోంది. అయితే గత కొంత కాలంగా రష్మిక మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. దీంతో, హైదరాబాద్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డిని కలిసింది. ఈ విషయాన్ని డాక్టర్ గురువారెడ్డి స్వయంగా తెలిపారు. మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ రష్మిక తన వద్దకు వచ్చిందని చెప్పారు. అయితే, కంగారు పడాల్సిందేమీ లేదని ఆయన తెలిపారు. 

రష్మిక తన వద్దకు రావడంపై డాక్టర్ గురువారెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఫన్నీగా స్పందించారు. 'సామీ... సామీ' అంటూ బరువంతా మోకాళ్లపై వేసి డ్యాన్స్ చేయడం వల్లే మోకాళ్ల నొప్పులు వచ్చాయని కామెడీగా రష్మికతో చెప్పానని అన్నారు. 'పుష్ప' సినిమా చూసినప్పటి నుంచి రష్మికను కలిసి అభినందించాలనుకున్నానని... అయితే, మోకాలి నొప్పి వల్ల ఆమె తన దగ్గరకు వచ్చే అవకాశం కలుగుతోందని చెప్పారు. త్వరలోనే అల్లు అర్జున్ కూడా భుజం నొప్పితో వస్తాడేమోనని సరదా వ్యాఖ్యలు చేశారు.
Rashmika Mandanna
Tollywood

More Telugu News