Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ దుమారం.. సీఎం ఏక్‌నాథ్ షిండే కుర్చీలో కూర్చున్న తనయుడు

Pic of Shindes Son Shrikant Shinde on CM Chair Goes Viral
  • సీఎం కుమారుడి చేతిలో ఫైల్
  • ‘సూపర్ సీఎం’ అని విమర్శిస్తున్న విపక్షాలు
  • విమర్శలపై స్పందించిన శ్రీకాంత్ షిండే
  • అది సీఎం అధికారిక నివాసం కాదని స్పష్టీకరణ
సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న ఫొటో ఒకటి మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి కారణమైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సీఎం కుర్చీలో కూర్చున్న ఫొటో ఇది. ఆ గదిలో ప్రభుత్వాధికారులు నిల్చుని ఉన్నారు. అంతేకాదు, ఆయన చేతిలో ఓ ఫైల్ ఉండడం ఈ మొత్తం దుమారానికి కారణమైంది. ఈ ఫొటో వెలుగులోకి రావడంతో విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ‘సూపర్ సీఎం’ అని విమర్శిస్తున్నాయి.

ఈ విమర్శలపై శ్రీకాంత్ షిండే స్పందించారు. ముఖ్యమంత్రి రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. ఆయన చాలా సమర్థుడైన సీఎం అని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో థానే నివాసంలోనిదని, అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం కాదని వివరణ ఇచ్చారు. సీఎంతోపాటు తాను కూడా దానిని ఉపయోగించుకుంటూ ఉంటానని శ్రీకాంత్ స్పష్టం చేశారు.
Maharashtra
Eknath Shinde
Shrikant Shinde
Viral Pics

More Telugu News