నాగపూర్ లో గతరాత్రి వర్షం... టీమిండియా, ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ ఆలస్యం

23-09-2022 Fri 18:54
  • చిత్తడిగా మారిన మైదానం
  • తీవ్రంగా శ్రమించిన స్టేడియం సిబ్బంది
  • ఆలస్యం కానున్న టాస్
Wet outfield delayed 2nd T20 match between Team India and Australia
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. ఈ మ్యాచ్ కు వేదికైన నాగపూర్ లో గతరాత్రి వర్షం కురియడంతో మైదానం చిత్తడిగా మారింది. దాంతో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. పిచ్ పై కవర్లు కప్పినప్పటికీ, అవుట్ ఫీల్డ్ లో ఒకట్రెండు చోట్ల తేమ శాతం అధికంగా ఉంది. దాంతో మైదానాన్ని మ్యాచ్ కు అనువుగా సిద్ధం చేసేందుకు స్టేడియం సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మరికాసేపట్లో టాస్ వేయనున్నారు. 

కాగా, ఈ మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా నెగ్గడం తెలిసిందే. దాంతో ఆ జట్టు సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టీమిండియాకు సిరీస్ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో నాగపూర్ లో హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది.