Nagarjuna: కర్నూల్ వేదికగా 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్!

The Ghost movie update
షార్ట్స్‌లో చూడండి
నాగార్జున కథానాయకుడిగా 'ది ఘోస్ట్' సినిమా రూపొందింది. సునీల్ నారంగ్ .. శరత్ మరార్ .. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ ఈవెంట్ కి 'కర్నూల్' వేదిక కానుంది. అక్కడి ఎస్.టి.బి.సి కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ  ఫంక్షన్ ను నిర్వహించనున్నారు. ఆ రోజున నాగచైతన్య - అఖిల్ ఇద్దరూ కూడా ఈ వేడుకకి హాజరు కానున్న విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను వదిలారు.

నాగార్జున సరసన నాయికగా సోనాల్ చౌహన్ నటించిన ఈ సినిమాలో, సురేంద్రన్ ..  రవి వర్మ ..  శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ  సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. 'గరుడ వేగ' తరువాత ప్రవీణ్ సత్తారు నుంచి వస్తున్న సినిమా కావడంతో, అందరిలోను ఆసక్తి ఉంది.
Go Back to Shorts
Nagarjuna
Sonal Chouhan
Anika Surendran
The Ghost Movie

More Telugu News