సమంత కెరియర్ లో ప్రత్యేకం 'శాకుంతలం' .. రిలీజ్ డేట్ ఖరారు!

23-09-2022 Fri 17:03
  • గుణశేఖర్ తాజా చిత్రంగా రూపొందిన 'శాకుంతలం'
  • కాళిదాస విరచిత కావ్యప్రధానమైన కథ 
  • ప్రధానమైన పాత్రను పోషించిన సమంత 
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ 
  • నవంబర్ 4వ తేదీన ఐదు భాషల్లో విడుదల 
Shakunthalam release date confirmed
తెలుగులో చారిత్రక .. పౌరాణిక చిత్రాలను సమర్థవంతంగా తెరకెక్కించగల దర్శకుడిగా గుణశేఖర్ కి మంచి పేరు ఉంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శాకుంతలం' సిద్ధమవుతోంది. మహాకవి కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' కావ్యం నుంచి ఈ కథా వస్తువును తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ - బి.సరోజా దేవి జంటగా 'శకుంతల' వచ్చింది. 

ఇప్పుడు అదే కథతో సమంత కథానాయికగా గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాను రూపొందించాడు. నీలిమా గుణ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. కొంతకాలంగా ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ను జరుపుకుంటోంది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించిన ఈ సినిమాలో, మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి .. కబీర్ దుహాన్ సింగ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.