Pattabhi: జగన్ పర్యటన అంటేనే జనాలు భయపడుతున్నారు: టీడీపీ నేత పట్టాభి

People are afraiding for Jagan programmes says Pattabhi
  • జగన్ పర్యటన అంటేనే అన్నింటినీ బలవంతంగా మూసివేయిస్తున్నారన్న పట్టాభి 
  • జనాలను సభకు బలవంతంగా తరలిస్తున్నారని ఆరోపణ 
  • జనాలు సభ నుంచి వెళ్లిపోకుండా గేట్లు వేస్తున్నారని వ్యాఖ్య 
గతంలో బందిపోట్లు, దొంగలను చూసి జనాలు భయపడేవారని... ఇప్పుడు సీఎం జగన్ పర్యటన అంటేనే భయపడుతున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. జగన్ పర్యటన అంటేనే అన్నింటినీ బలవంతంగా మూసేస్తున్నారని... చివరకు మెడికల్ షాపులను కూడా మూసివేయడం దారుణమని చెప్పారు. సీఎం సభలకు జనాలను బలవంతంగా తరలిస్తున్నారని... కార్యక్రమానికి రాకపోతే పథకాలను ఆపేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. జగన్ వైజాగ్ పర్యటన సందర్భంగా పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అధికారులే ప్రకటించడం అధికార దుర్వినియోగం కాదా? అని ప్రశ్నించారు. 

సభ నుంచి ప్రజలు బయటకు వెళ్లిపోకుండా గేట్లకు తాళాలు వేస్తున్నారని పట్టాభి అన్నారు. జగన్ కుప్పం పర్యటనకు వివిధ ప్రాంతాల నుంచి జనాలను తరలించారని చెప్పారు. బీసీల మీద ఎంతో ప్రేమ ఉందని చెప్పుకునే జగన్... చిత్తూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని అడిగారు. జగన్ వద్ద పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన ఉంది కాబట్టే బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయలో ప్యాలస్ లు ఉన్నాయని చెప్పారు.
Pattabhi
Telugudesam
YSRCP
Jagan

More Telugu News