ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు

23-09-2022 Fri 15:42
  • నేడు, రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు
  • అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడి
  • బంగాళాఖాతం నుంచి రాజస్థాన్ వరకు ఉపరితల ఆవర్తనం
Rain alert for AP
అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి వర్ష సూచన చేసింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 23న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

ఈ నెల 24న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో... ఈ నెల 25న ఉత్తర కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ రాజస్థాన్ వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని, ఏపీలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయని వివరించింది.