Telangana: తెలంగాణలో మరో 48 బీసీ గురుకులాల ఏర్పాటు

  • గురుకులాల్లో అడ్మిషన్ల కోసం పెరుగుతున్న డిమాండ్
  • కొత్తగా 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటు
  • 33 గురుకులాల ఏర్పాటుకూ తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్
  • అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ts government announces 48 new Gurukulams

తెలంగాణలో గురుకుల విద్యను మరింతగా విస్తరించేందుకు కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న గురుకులాలకు అదనంగా కొత్తగా 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలు, 33 గురుకులాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త గురుకులాల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. 


గురుకులాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో నాణ్యమైన విద్యను ఉచితంగానే అందిస్తున్నారు. ఈ కారణంగా ఇటీవలి కాలంలో గురుకులాల్లో అడ్మిషన్ల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ కారణంగా కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

  • Loading...

More Telugu News