TDP: కుప్పం టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

ap high court grants bail to kuppam tdp leaders
  • కుప్పంలో చంద్రబాబు టూర్ సందర్భంగా ఘర్షణ
  • వైసీపీ ఫిర్యాదుల ఆధారంగా టీడీపీకి చెందిన ఏడుగురు నేతల అరెస్ట్
  • రూ.25 వేల బాండు, ఇద్దరి పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలకు శుక్రవారం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఫిర్యాదుల ఆధారంగా టీడీపీకి చెందిన శ్రీనివాసులు, రాజ్ కుమార్, మునుస్వామిలతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.


వీరంతా తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏడుగురికి బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున బాండు, ఇద్దరేసి వ్యక్తుల పూచీకత్తులు సమర్పించి బెయిల్ పొందవచ్చని హైకోర్టు పేర్కొంది.
TDP
Chandrababu
Kuppam
AP High Court
YSRCP

More Telugu News