ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోమారు రిమాండ్ పొడిగింపు

23-09-2022 Fri 11:41
  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడిగా అనంతబాబు
  • ఇదివరకు విధించిన రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరచిన పోలీసులు
  • అక్టోబర్ 7 వరకు రిమాండ్ పొడిగించిన న్యాయమూర్తి
mlc anantha babu fjudicial remand extended
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్ ను పొడిగించింది. ఇదివరకు విధించిన రిమాండ్ గడువు శుక్రవారంతో పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. 

దీంతో అనంతబాబు రిమాండ్ ను అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఫలితంగా తిరిగి ఎమ్మెల్సీని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మరోపక్క, హత్యకేసులో నిందితుడిగా వున్న ఆయనను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.