Telangana: అన్ని ఆర్థిక అవరోధాలకు యాక్ట్స్ ఆఫ్ గాడ్ కారణమట: కేటీఆర్

  • డాలర్ తో అత్యంత కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ
  • కేంద్రంపై విమర్శలు గుప్పించిన కేటీఆర్
  • రూపాయి పతనమవుతుంటే రేషన్ షాపుల్లో మోదీ ఫొటో కోసం నిర్మల వెతుకుతున్నారంటూ సెటైర్
ktr satires on bjp over declining rupee value

డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిన వైనంపై కేంద్రంలోని బీజేపీ సర్కారును టార్గెట్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు సంధించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఆయన వరుస వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ.. గురువారం రికార్డు స్థాయిలో రూ.80కి పడిపోగా... తాజాగా శుక్రవారం ఉదయం ఆ విలువ మరింత పతనమై రూ.80.38కి పడిపోయింది.

ఈ స్థితిపై శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో కేటీఆర్ వరుసగా పోస్టులను పెట్టారు. రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్న కేటీఆర్... అయినా కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కోసమే వెతుకుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా సాధారణ పరిస్థితుల్లోనే రూపాయి విలువ పతనమైపోయిందని ఆమె చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. ఇలా అన్ని ఆర్థిక అవరోధాలకు యాక్ట్స్ ఆఫ్ గాడ్ కారణమని చెబుతున్నారని ఆరోపించారు.

More Telugu News