హీరో బైకుల ధరలు పెరిగాయి

22-09-2022 Thu 20:55
  • ధరల పెంపు ప్రకటన విడుదల చేసిన హీరో మోటో కార్ప్
  • ఉత్పత్తి ఖర్చులు పెరగడంతోనే ధరలు పెంచుతున్నట్లు వెల్లడి
  • ఒక్కో బైక్ ధర రూ.1,000 మేర పెరుగుతుందని ప్రకటన
  • పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడి
hero moto corp increases its bikes and scooters price
ద్విచక్ర వాహనాల తయారీలో దిగ్గజ సంస్థ హీరో మోటో కార్ప్ తన వాహనాల ధరలను పెంచింది. ఒక్కో వాహనంపై రూ.1,000 పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు గురువారం హీరో మోటో కార్ప్ నుంచి ఓ ప్రకటన జారీ అయ్యింది. వాహనాల తయారీ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బైకుల ధరలు పెంచక తప్పడం లేదని ఆ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా ఈ ధరల పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని కూడా హీరో తెలిపింది. తాను విక్రయిస్తున్న మోటార్ సైకిళ్లతో పాటు స్కూటర్లకు కూడా ఈ ధరల పెరుగుదల వర్తిస్తుందని వెల్లడించింది.