BJP: ఎన్టీఆర్ ను అవమానించినట్టే.. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పురందేశ్వరి

  • ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పిడిపై స్పందించిన పురందేశ్వరి
  • ఎన్టీఆర్ పై అపార గౌరవం ఉందంటూనే ఆయన పేరు మార్చేస్తారా? అని ప్రశ్న
  • స్వలాభాపేక్ష లేకుండా హెల్త్ వర్సిటీని ఏర్పాటు చేశారన్న బీజేపీ నేత
bjp leader purandeswari comments on name change of ntr health university

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాదాపుగా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ తనయ, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి గురువారం స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో నుంచి ఎన్టీఆర్ పేరును తీసి వేయడం అంటే.. ఎన్టీఆర్ ను అవమానించినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. 


తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒక గొడుగు కిందకు తీసుకురావాలన్న మంచి ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ ఈ సంస్థను ఏర్పాటు చేశారని ఆమె చెప్పుకొచ్చారు. స్వలాభాపేక్ష లేకుండా ఎన్టీఆర్ పాలన సాగిస్తే... ఇప్పటి పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును ఎందుకు మార్చారో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఓ వైపు ఎన్టీఆర్ పై తనకు అపార గౌరవం ఉందంటూనే... ఆయన పేరును తొలగించడం అన్యాయమని ఆమె అన్నారు.

More Telugu News