Telangana: షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి... ప్రియాంక గాంధీకి కోమటిరెడ్డి లేఖ

komatireddy venkat reddy letter to priyanka gandhi over shabbir ali
  • షబ్బీర్ కు పలు కేసులతో సంబంధం ఉందన్న వెంకట్ రెడ్డి
  • ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశముందని ఫిర్యాదు
  • షబ్బీర్ వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న షబ్బీర్ అలీని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన ప్రియాంకా గాంధీని కోరారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన తన లేఖలో వివరించడం గమనార్హం. 

చీటింగ్ సహా పలు ఇతర కేసుల్లో షబ్బీర్ అలీకి ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ప్రస్తావించారు. ఈ కారణంగా షబ్బీర్ అలీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అదే జరిగితే పార్టీ పరువు పోతుందని చెప్పారు. షబ్బీర్ ను ఇంకా పార్టీలోనే కొనసాగిస్తే ఆయన వల్ల పార్టీకి నష్టం జరగవచ్చని కూడా కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Telangana
Congress
Komatireddy Venkat Reddy
Shabbir Ali
Priyanka Gandhi

More Telugu News