BJP: ఏపీ టూర్ కు వచ్చిన నితిన్ గడ్కరీకి వినూత్న స్వాగతం పలికిన కడియపులంక నర్సరీ

union minister nitin gadkari recieves grand welcome at kadiyapilanka in andhra pradesh
  • రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్న నితిన్ గడ్కరీ
  • మోరంపూడి ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి
  • కడియపులంకలో సత్యదేవ్ నర్సరీని సందర్శించిన వైనం
  • వివిధ రకాల పూలతో గడ్కరీ చిత్రాన్ని రూపొందించిన సత్యదేవ్ నర్సరీ
కేంద్ర రవాణా శాఖ మంత్రి గురువారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించనున్న మోరంపూడి ఫ్లై ఓవర్ కు ఆయన భూమి పూజ చేశారు. రాజమహేంద్రవరంలో ఫ్లై ఓవర్ తో నగరంలోని ట్రాఫిక్ చిక్కులు భారీగా తగ్గుతాయన్న వాదన ఉంది. ఈ కార్యక్రమం అనంతనం ఆయన రాజమహేంద్రవరం సమీపంలోని నర్సరీల గ్రామం కడియపులంక చేరుకున్నారు. గ్రామంలోని సత్యదేవ్ నర్సరీలో ఆయనకు వినూత్న స్వాగతం లభించింది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తమ నర్సరీకి వస్తున్నారన్న విషయం తెలియగానే... సత్యదేవ్ నర్సరీ యాజమాన్యం కేంద్ర మంత్రికి గుర్తుండిపోయేలా వినూత్న స్వాగతం పలకాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఇతరత్రా నేతలు వచ్చే సమయంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలతో పాటుగా మొత్తం పూలతోనే గడ్కరీ చిత్రాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకుంది. వివిధ రకాల కలర్ ఫుల్ పూలతో గడ్కరీ బొమ్మను తీర్చిదిద్దిన సత్యదేవ్ నర్సరీ యాజమాన్యం తాము అనుకున్నట్లుగానే గడ్కరీని థ్రిల్ కు గురి చేసింది. పూలతో అద్దిన తన చిత్రాన్ని గడ్కరీ అలా చూస్తూ నిలబడిపోయారు.
BJP
Nitin Gadkari
Rajamahendravaram
Kadiyapulanka
Satyadev Nursery

More Telugu News