Movie news: ‘జిందాబాద్​ ఠాకూర్​ సాబ్​’.. మృణాల్​ నటనపై కంగనా రనౌత్​ ప్రశంసలు

Kangana ranaut praises Mrinal about Sita ramam movie
  • ఆమెలా మరెవరూ నటించలేరన్న కంగనా రనౌత్‌
  • మృణాల్ నిజంగానే ఒక రాణి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్
  • సీతారామం సినిమాలో నటీనటులంతా బాగా చేశారని ప్రశంస
సీతారామం సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ నటన అద్భుతమని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసించారు. ఆ సినిమా గురించి కంగన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. సీతారామం సినిమాలో అందరూ బాగా నటించారని.. అయితే అందులో మృణాల్ నటన తనకు అద్భుతం అనిపించిందని కంగనా రనౌత్ పేర్కొన్నారు. తను భావోద్వేగ పూరిత సన్నివేశాల్లో చాలా బాగా నటించిందని, అలా మరెవరూ నటించలేరని ప్రశంసించారు. ‘మృణాల్ నిజంగానే ఓ రాణి. జిందాబాద్‌ ఠాకూర్‌ సాబ్. ఇక ముందు ముందు కాలం మీదే’ అంటూ ఇన్ స్టా పోస్ట్ లో పేర్కొన్నారు. తన పోస్టులో ఒక రాణి ఎమోజీని కూడా జత చేశారు.

అందమైన ప్రేమకథగా..
ఆర్మీ నేపథ్యంలో రూపొందించినా, ఓ అందమైన ప్రేమకథగా సీతారామం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. కథానాయిక సీత పాత్రలో మృణాల్‌ ఠాకూర్‌, కథానాయకుడు రామ్‌ గా దుల్కర్‌ సల్మాన్‌ అద్భుతంగా నటించారన్న ప్రశంసలు పొందారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, సుమంత్, గౌతమ్‌ మీనన్‌, ప్రకాశ్ రాజ్‌ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
Movie news
Kangana Ranaut
Mrinal
Actress
Tollywood
Sita ramam

More Telugu News