దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా కోల్ కతా... హైదరాబాద్ స్థానం ఎంతంటే..!

21-09-2022 Wed 16:39
  • దేశంలో మూడో సురక్షిత నగరంగా హైదరాబాద్
  • రెండో స్థానంలో నిలిచినా పూణే
  • వివరాలను వెల్లడించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
Hyderabad is 3rd safest city in Hyderabad
ఎన్నో అంశాల్లో ప్రత్యేకతలను చాటుకుంటున్న హైదరాబాద్ నగరం మరో ఘనతను సాధించింది. దేశంలోనే అత్యంత సుక్షితమైన నగరాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా కోల్ కతా నిలిచింది. పూణే రెండో స్థానంలో ఉంది. 

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం... 2021లో 10 లక్షల మంది ప్రజలకు గాను 2,599 నేరాలు జరిగాయి. ఇదే సమయంలో ఢిల్లీలో 18,596 నేరాలు చోటు చేసుకున్నాయి. కోల్ కతాలో 1,034 నేరాలు... పూణేలో 2,568 నేరాలు జరిగాయి. కేవలం ఎనిమిదేళ్ల సమయంలోనే తెలంగాణ సురక్షిత నగరాల జాబితాలో చోటుచేసుకోవడం గమనార్హం. సురక్షిత నగరంగా పేరు తెచ్చుకోవడంతో... తెలంగాణకు పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.