బురద నిండిన గుంతల రోడ్డుపై పెళ్లి కూతురు.. వైరల్​ వీడియో ఇదిగో

21-09-2022 Wed 16:23
  • బాగా రెడీ అయి, నగలు ధరించి బురద రోడ్డుపై నడుస్తూ వచ్చిన యువతి
  • తమ ప్రాంతంలో రోడ్డు దుస్థితిని చూపడానికి ఈ పని చేశామన్న పెళ్లికూతురు, ఫొటోగ్రాఫర్
  • ఫొటోలు, వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన యారో వెడ్డింగ్ కంపెనీ
Kerala bride walks on road full of potholes
ఇటీవలి కాలంలో పెళ్లి ఫొటోలు, వీడియోలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లు అయితే ఒక్కోసారి తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. ఎక్కడెక్కడికో వెళుతూ.. చిత్రమైన పద్ధతుల్లో షూటింగ్ లు చేస్తూండటం ఆకట్టుకుంటోంది. అయితే కేరళకు చెందిన ఓ యువతి, ఆమె పెళ్లికి ఫొటోలు, వీడియోల కాంట్రాక్టు తీసుకున్న యారో వెడ్డింగ్ కంపెనీ వాళ్లు కలిసి చిత్రమైన ఆలోచన చేశారు. వెడ్డింగ్ ఫొటో షూట్ కార్యక్రమాన్ని సామాజిక సమస్య అంశానికి జత చేశారు.

గుంతల సమస్యను చెప్పుకోవడానికి..
  • కేరళలో నిండా గుంతలు, బురదతో నిండిన ఓ రోడ్డులో పెళ్లి కూతురుతో ఫొటో షూట్ చేశారు. ఎరుపు రంగు చీర కట్టుకుని, ఒంటి నిండా నగలు వేసుకుని.. అందంగా తయారైన పెళ్లి కూతురు ఆ బురద, గుంతల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తుండగా ఫొటోలు, వీడియోలు తీశారు. 
  • ఆ సమయంలో పలు వాహనాలు కూడా ఆ దారిలో ప్రయాణిస్తున్నాయి. గుంతల నుంచి తప్పించుకుంటూ, పడిపోకుండా ఉండేలా మెల్లగా వాహనాలు నడుపుకొంటూ వెళ్లడం కనిపిస్తోంది.
  • తమ ప్రాంతంలో రోడ్లు సరిగా లేని పరిస్థితి, చిన్న వర్షానికే అంతా బురదగా మారుతున్న దుస్థితిని చూపించడం కోసం తాము ఈ పనిచేసినట్టు పెళ్లి కూతురు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లు చెబుతున్నారు.
  • ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 43 లక్షల వ్యూస్ రాగా.. మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
  • ‘అది రోడ్డులా లేదు.. స్విమ్మింగ్ పూల్స్ తో కూడిన ఏరియాలా ఉంది..’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘నీటి గుంతలు బాగున్నాయి. హాయిగా కొన్ని చేపలు తెచ్చి పెంచుకోవచ్చు..’ అంటున్నారు.