దసరా సెలవులను కుదించాలన్న ఎస్‌సీఈఆర్‌టీ... ససేమిరా అన్న తెలంగాణ సర్కారు
- దసరా సెలవులపై ఇదివరకే ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
- వర్షాల నేపథ్యంలో ఇచ్చిన సెలవులను సర్దుబాటు చేయాలన్న ఎస్‌సీఈఆర్‌టీ
- సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో... ఆ సమయంలో విద్యార్థులు నష్టపోయిన సమయాన్ని తిరిగి పొందే దిశగా దసరా సెలవులను కుదించాలంటూ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఎస్‌సీఈఆర్‌టీ లేఖ ఆధారంగా రాష్ట్రంలో దసరా సెలవుల షెడ్యూల్ మారనుందంటూ ప్రచారం సాగింది.