DR. N.T.R UNIVERSITY OF HEALTH SCIENCES: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు.. నేడు అసెంబ్లీ ముందుకు సవరణ బిల్లు

  • 1986లో పురుడుపోసుకున్న యూనివర్సిటీ
  • తొలుత యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా నామకరణం
  • చంద్రబాబు హయాంలో పేరు మార్పు 
  • డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పాలని ప్రభుత్వం నిర్ణయం
  • బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి విడదల రజనీ
ntr health university name will be changed as ysr health university

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిపోనుంది. ఈ మేరకు ప్రభుత్వం బిల్లును సిద్ధం చేసింది. యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ నేడు సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లుగా నేడు అసెంబ్లీ ముందుకు రాబోతున్న దీనిని వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రవేశపెడతారు.

నిజానికి ఏపీలో వైద్య విద్యార్థులకు అప్పట్లో ప్రత్యేకంగా యూనివర్సిటీ అంటూ ఉండేది కాదు. ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలే వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసేవి. దీంతో ఎంబీబీఎస్ నకిలీ సర్టిఫికెట్లు కూడా పుట్టుకొచ్చేవి. ఇలా అయితే లాభం లేదని భావించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు స్వయంప్రతిపత్తి కలిగిన ఓ వర్సిటీ ఉండాలన్న ఉద్దేశంతో హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించాలని నిర్ణయించారు. 

అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా విజయవాడలో దానిని నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా 1986లో నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పట్లో దీనికి ‘యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1998లో దీనికి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా పేరు మార్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ దాని పేరును మరోమారు మార్చుతూ ‘డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’గా మార్చారు. ఇప్పుడీ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

More Telugu News