Matrimonial Ad: సాఫ్ట్ వేర్ ఇంజినీర్లా... దయచేసి కాల్ చేయొద్దు...!: ఆసక్తికరంగా వధువు మ్యాట్రిమొనీ యాడ్

  • వరుడి కోసం పత్రికా ప్రకటన
  • అబ్బాయి ఐఏఎస్/ఐపీఎస్ అయ్యుండాలన్న అమ్మాయి
  • ఐటీ రంగానికి భవిష్యత్తు లేదని వెల్లడి
Matrimonial ad grabs attention

తమకు కావల్సిన వరుడు, వధువు కోసం మ్యాట్రిమొనీ ప్రకటనలు ఇవ్వడం తెలిసిందే. తమ గుణగణాలు వెల్లడించి, ఎదుటివారి గుణగణాలు ఎలా ఉండాలో ఆ యాడ్ లో పేర్కొనడం సర్వసాధారణమైన విషయం. అయితే తనకు తగిన వరుడి కోసం ఓ అమ్మాయి ఇచ్చిన మ్యాట్రిమొనీ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

అబ్బాయి తప్పనిసరిగా ఐఏఎస్/ఐపీఎస్/డాక్టర్ (పీజీ), ఇండస్ట్రియలిస్ట్/బిజినెస్ మేన్ అయ్యుండాలని ఆ అమ్మాయి పేర్కొంది. అది కూడా తమ కులానికి చెందినవాడే అయ్యుండాలని తెలిపింది. 

అయితే ఆ ప్రకటన చివర్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఉద్దేశించి ఓ హెచ్చరిక జారీ చేసింది. "సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు దయచేసి కాల్ చేయొద్దు... భవిష్యత్తులో ఐటీ రంగానికి ఏమంత గొప్ప రోజులు లేవు" అని స్పష్టం చేసింది. ఈ మ్యాట్రిమొనీ యాడ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News