ఏపీ హైకోర్టును క‌డ‌ప‌లో ఏర్పాటు చేయాలి!...రాయ‌చోటిలో జిల్లా లాయ‌ర్ల సంక్షేమ స‌మితి ధ‌ర్నా!

19-09-2022 Mon 15:23
  • 3 రాజ‌ధానుల దిశ‌గా వైసీపీ స‌ర్కారు
  • ఏపీ హైకోర్టును క‌ర్నూలులో ఏర్పాటు చేసే దిశ‌గా చ‌ర్య‌లు
  • కొత్త డిమాండ్‌తో అన్న‌మయ్య జిల్లా కేంద్రంలో న్యాయ‌వాదుల ధ‌ర్నా
annamayya district lawyers demands to ap high court should in kadapa
ఏపీకి మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసే దిశ‌గా వైసీపీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌ధానిని, విశాఖలో పాల‌నా రాజ‌ధానిని, క‌ర్నూలులో న్యాయ రాజ‌ధానిని ఏర్పాటు చేసే దిశ‌గా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో సోమ‌వారం న్యాయ‌వాదుల నుంచి ఓ స‌రికొత్త డిమాండ్ వినిపించింది. ఏపీ హైకోర్టును క‌డ‌ప‌లో ఏర్పాటు చేయాల‌ని న్యాయ‌వాదులు సోమ‌వారం ధ‌ర్నాకు దిగారు. 

అన్న‌మ‌య్య జిల్లా కేంద్రం రాయ‌చోటిలో ఈ మేర‌కు సోమ‌వారం జిల్లా న్యాయ‌వాదుల సంక్షేమ స‌మితి ధ‌ర్నాకు దిగింది. క‌డ‌ప రాయ‌ల‌సీమ‌లోని మిగిలిన 3 జిల్లాల‌కు మ‌ధ్య‌లో ఉన్న కార‌ణంగా... ఏపీ హైకోర్టును క‌డ‌ప‌లోనే ఏర్పాటు చేయాల‌ని న్యాయ‌వాదులు డిమాండ్ చేశారు.