Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన

  • వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన
  • దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు
Low Pressure formed in Bay Of Bengal as IMD issues rain alert for AP

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అనేకచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది. 

దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని ఐఎండీ వెల్లడించింది.

More Telugu News