తెలంగాణలో తాజాగా 71 కరోనా కేసులు

18-09-2022 Sun 20:07
  • గత 24 గంటల్లో 7,007 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 47 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 88 మంది
  • ఇంకా 751 మందికి చికిత్స
Telangana corona cases report
తెలంగాణలో కరోనా వైరస్ రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 7,007 కరోనా పరీక్షలు నిర్వహించగా, 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఒక్క హైదరాబాదులోనే 47 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇంకా 94 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో 88 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,36,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,31,830 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 751 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.