Jai Ram Ramesh: మేం 2009లోనే చీతా ప్రాజెక్టు తీసుకువచ్చాం... ఇదిగో లేఖ: జైరాం రమేశ్

Jai Ram Ramesh shown a letter to prove they had initiated Cheetah project in 2009
  • నిన్న ప్రధాని మోదీ పుట్టినరోజు
  • నమీబియా చీతాలను మధ్యప్రదేశ్ అడవుల్లో విడుదల చేసిన మోదీ
  • గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శలు
  • మోదీ అబద్ధాలు చెప్పే జబ్బుతో బాధపడుతున్నాడన్న జైరాం రమేశ్
గత ప్రభుత్వాలు చీతాలను తిరిగి భారత్ తీసుకువచ్చేందుకు ఎలాంటి కృషి చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం తెలిసిందే. నిన్న మోదీ తన పుట్టినరోజు సందర్భంగా, నమీబియా నుంచి తీసుకొచ్చి చీతాలను మధ్యప్రదేశ్ లోని కునో-పాల్పూర్ నేషనల్ పార్క్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. 

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. మోదీ అబద్ధాలు చెప్పే జబ్బుతో బాధపడుతున్నారని విమర్శించారు. 2009లోనే యూపీఏ ప్రభుత్వం చీతా ప్రాజెక్టు తీసుకువచ్చిందని వెల్లడించారు. 

గతంలో తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖను జైరాం రమేశ్ ఈ సందర్భంగా పంచుకున్నారు. నిన్న తాను భారత్ జోడో యాత్రలో ఉన్నందున, ఈ లేఖను విడుదల చేయలేకపోయానని వివరణ ఇచ్చారు.
Jai Ram Ramesh
Cheetah Project
Narendra Modi
India

More Telugu News