Sweta Tiwari: ఎవరితోనైనా రిలేషన్ షిప్ ఉంటే కొనసాగించమని నా కూతురుకు చెప్పాను: శ్వేతా తివారి

I dont believe marriage says Sweta Tiwari
  • పెళ్లిపై తనకు నమ్మకం లేదన్న శ్వేతా తివారి
  • పెళ్లి చేసుకోమని తన కూతురిపై ఒత్తిడి చేయబోనని వ్యాఖ్య
  • రిలేషన్ షిప్ ను పెళ్లి వరకు తీసుకురావద్దని సూచించానన్న శ్వేత
బాలీవుడ్ బ్యూటీ శ్వేతా తివారీకి వయసు పెరుగుతున్నా అందం మాత్రం తగ్గడం లేదు. తన కూతురు పెద్దదైపోతున్నా... శ్వేతా తివారి ఇప్పటికీ తన హాట్ ఫొటోలతో కుర్రకారును ఉర్రూతలూగిస్తుంటుంది. మరోవైపు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వివాహంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. తనకు పెళ్లిపై ఏ మాత్రం నమ్మకం లేదని ఆమె తెలిపింది. పెళ్లి చేసుకోమని తన కూతురుని కూడా ఒత్తిడి చేయబోనని చెప్పింది. పెళ్లి విషయంలో తన కూతురి నిర్ణయమే ఫైనల్ అని తెలిపింది. ఎవరి కోసమో మన జీవితాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదని తన కూతురికి చెప్పానని... ఏదైనా చేసే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని సూచించానని చెప్పింది. 

ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉంటే దాన్ని కొనసాగించమని తన కూతురుకి చెప్పానని... అయితే, ఆ సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకురావద్దని సూచించానని శ్వేత తెలిపింది. ఇద్దరు పిల్లలకు సింగిల్ పేరెంట్ గా ఉన్నప్పటికీ తాను ఎలాంటి ఇబ్బంది పడటం లేదని చెప్పింది. డబ్బు కోసమో, ఇంకో అవసరం కోసమో తన మాజీ భర్తను ఎప్పుడూ సాయం కోరలేదని తెలిపింది. తాను రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు ఒక్కరితో కూడా కలిసి ఉండటం లేదని సోషల్ మీడియాలో తనపై కామెంట్లు వస్తుంటాయని... వాటిని తాను పట్టించుకోనని చెప్పింది.
Sweta Tiwari
Bollywood
Marriage
Daughter

More Telugu News