Coriander: భారీగా పెరిగిన కొత్తిమీర ధర.. వరంగల్ మార్కెట్లో కిలో రూ. 400

  • నిన్నమొన్నటి వరకు రూ. 80-100 పలికిన వైనం
  • కర్ణాటకలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట
  • అరకొరగా వస్తుండడంతో ఎగబడుతున్న వ్యాపారులు
coriander now very costly in warangal

కూరగాయల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్న వేళ కొత్తమీర ధర కూడా అందకుండా పోతోంది. ఐదు రూపాయలకు రెండుమూడు కట్టలు లభించే వేళ కిలో కొత్తిమీర ఏకంగా రూ. 400కు చేరుకుంది. నిన్నమొన్నటి వరకు కిలో కొత్తమీర రూ. 80 నుంచి రూ. 100 పలకగా వరంగల్, ఖమ్మం మార్కెట్‌లలో ప్రస్తుతం రూ. 400కు పైనే పలుకుతోంది. కర్ణాటక నుంచి కొత్తిమీర ఈ మార్కెట్లకు సరఫరా అవుతోంది. 

కర్ణాటకలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంట దెబ్బతింది. దీంతో అక్కడి నుంచి ప్రస్తుతం అరకొరగా సరఫరా అవుతోంది. కొద్దిమొత్తంలో వస్తున్న కొత్తిమీర కోసం వ్యాపారులు పోటీపడుతుండడంతో దాని ధర అమాంతం కొండెక్కింది. నిన్న పలుమార్కెట్లలో కిలో రూ. 400 వరకు పలికింది. మహబూబాబాద్‌ జిల్లాలో రోజుకు 20 క్వింటాళ్ల కొత్తిమీర అవసరం కాగా, ప్రస్తుతం రోజుకు 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని, ధరల పెరుగుదలకు ఇదే కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

More Telugu News