Bihar: నితీశ్ కుమార్‌కు అఖిలేశ్ యాదవ్ ఆఫర్.. యూపీలోని ఫుల్పూర్ నుంచి పోటీ చేయాలన్న ఎస్పీ చీఫ్

  • ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్న నితీశ్ కుమార్
  • ఫుల్పూర్ నుంచే పోటీ చేయాలంటున్న జేడీయూ కార్యకర్తలు
  • యూపీలో నచ్చిన స్థానం నుంచి పోటీ చేయొచ్చంటూ అఖిలేశ్  ఆఫర్
  • నిర్ధారించిన జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్
Nitish Kumar to contest 2024 polls from Uttar Pradeshs Phulpur Akhilesh Yadavs offer

ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు యూపీ నేత, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కోరుకున్న స్థానం నుంచి పోటీ చేయొచ్చని, తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని నితీశ్‌తో అఖిలేశ్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, నితీశ్ ఫుల్పూర్ నుంచే పోటీ చేయాలని జేడీయూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ తాజాగా మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ ఉత్తరప్రదేశ్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని హింటిచ్చారు. ఫుల్పూర్ నుంచే కాకుండా అంబేద్కర్ నగర్, మిర్జాపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయొచ్చని అన్నారు. ఈ విషయంలో అంగీకరించడానికి కానీ, నిరాకరించడానికి కానీ ఏమీ లేదన్న ఆయన.. నితీశ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్న విషయాన్ని సరైన సమయంలో ప్రకటిస్తారని అన్నారు. అయితే, అంబేద్కర్ నగర్, మీర్జాపూర్ నుంచి పోటీ చేయాలన్న ఆఫర్లు వస్తున్నాయని అన్నారు. ఆయన ప్రతిప్రక్షాలను ఏకం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే, పార్టీ కార్యకర్తలు మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని లలన్ సింగ్ పేర్కొన్నారు.  

2024 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ కీలకమన్న లలన్ సింగ్.. ప్రస్తుతం యూపీలో బీజేపీకి 65 ఎంపీ సీట్లు ఉన్నాయని అన్నారు. అఖిలేశ్ యాదవ్, నితీశ్ కుమార్, ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే యూపీలో బీజేపీ స్థానాలను 15-20కి తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.

More Telugu News