Telangana: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన రాహుల్ గాంధీ

rahul gandhi greets telangana people on liberation day
  • తెలంగాణ విమోచ‌న దినం సంద‌ర్భంగా రాహుల్ సందేశం
  • పోరాట స్ఫూర్తిని కొన‌సాగించాలంటూ పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేత‌
  • తెలుగులోనే సందేశాన్ని విడుద‌ల చేసిన వైనం
తెలంగాణ విమోచ‌న దినాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న సందేశాన్ని రాహుల్ గాంధీ తెలుగులోనే విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. రాహుల్ గాంధీ సోష‌ల్ మీడియా సందేశాన్ని మాజీ మంత్రి కొండా సురేఖ షేర్ చేశారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పంపిన సందేశంలో పోరాట స్ఫూర్తిని కొన‌సాగించాల‌ని రాహుల్ పిలుపునిచ్చారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం... తెలంగాణ రైతాంగ పోరాటంతో మొద‌లుపెట్టి.. భార‌త సైన్యం స‌హాయంతో సాధించి.. త్రివ‌ర్ణ ప‌తాకాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు ముద్దాడిన దినం.. అదే స్ఫూర్తిని ఎప్ప‌టికీ కొన‌సాగించాల‌ని ఆశిస్తూ.. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు అంటూ రాహుల్ త‌న సందేశంలో పేర్కొన్నారు.
Telangana
Congress
Rahul Gandhi
Konda Surekha

More Telugu News