Asaduddin Owaisi: ఆ సమయంలో 7వ నిజాం చాలా తప్పు చేశారు: అసదుద్దీన్ ఒవైసీ

  • 1948 జూన్ 15న ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన డ్రాఫ్ట్ పై సంతకం చేయలేదన్న ఒవైసీ 
  • సంతకం చేసి ఉంటే పోలీసు చర్య జరిగి ఉండేది కాదని వ్యాఖ్య 
  • నిజాంను మౌంట్ బాటన్, ఖాసీం రిజ్వీ మోసం చేశారని విమర్శ 
Nizam made a mistake says Owaisi

 ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 7వ నిజాంను విమర్శిస్తూ తప్పుపట్టారు. 1948 జూన్ 15న ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన ఒక డ్రాఫ్ట్ ను ఉస్మాన్ అలీ ఖాన్ ఆమోదించి ఉండాల్సిందని ఆయన అన్నారు. ఆ డ్రాఫ్ట్ ను నిజాం ఆమోదించి ఉంటే తెలంగాణలో పోలీస్ యాక్షన్ జరిగి ఉండేది కాదని చెప్పారు. 

కశ్మీరీలకు ఇచ్చిన ఆర్టికల్ 370 కన్నా ఎక్కువ లాభాలను పొందే అవకాశాన్ని నిజాం చేజార్చారని అన్నారు. నిజాం ఆనాడు ఎంతో అహంకారాన్ని ప్రదర్శించారని చెప్పారు. మరోవైపు, లార్డ్ మౌంట్ బాటన్, ఖాసీం రిజ్వీ ఇద్దరూ నిజాంను మోసం చేశారని చెప్పారు. ఎంఐఎం ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒవైసీ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News