Hanu Raghvapudi: ఆ హీరోలను అడగలేదు .. అదంతా పుకారే: హను రాఘవపూడి

Hanu Raghvapudi Interview
  • ఇటీవలే వచ్చిన 'సీతా రామం'
  • ఓవర్సీస్ లోను భారీ వసూళ్లు 
  • ఈ కథ దుల్కర్ కి మాత్రమే చెప్పానన్న డైరెక్టర్
  • నానీతో మరో సినిమా ఉంటుందంటూ వెల్లడి  

హను రాఘవపూడి నుంచి ఇటీవల వచ్చిన 'సీతా రామం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. దుల్కర్ - మృణాల్ ఠాకూర్ నటనకి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ కథ ముందుగా నానీ .. ఆ తరువాత విజయ్ దేవరకొండ .. రామ్ దగ్గరికి వెళ్లిందనే టాక్ వచ్చింది. వాళ్లు కాదంటేనే దుల్కర్ ను సంప్రదించారనే ప్రచారం జరిగింది. 
 
తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న హను రాఘవపూడికి ఎదురైంది. అందుకు ఆయన  స్పందిస్తూ  .. "నేను నానీని కలిసినమాట నిజం .. అలాగే విజయ్ దేవరకొండను .. రామ్ ను కలిసిన మాట కూడా నిజమే. వాళ్లతో చర్చలు జరిపిన మాట కూడా వాస్తవమే. కాకపోతే ఈ కథ కోసం కాదు. వాళ్లకి నేను చెప్పిన కథలు వేరు.

రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలోని కథను నానీకి చెప్పాను. అలాగే  విజయ్ దేవరకొండకి .. రామ్ కి కూడా వేరు వేరు జోనర్స్ కి సంబంధించిన కథలు చెప్పాను. 'సీతా రామం' కోసం మాత్రం దుల్కర్ ను తప్ప ఎవరినీ కలవలేదు. నానీతో సినిమా మాత్రం తప్పకుండా ఉంటుంది .. కాకపోతే ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను" అని అన్నాడు.

  • Loading...

More Telugu News