చరిత్రలో నిలిచిపోయేలా సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం కేసీఆర్ వల్లే సాధ్యమైంది: కవిత

17-09-2022 Sat 09:20
  • తెలంగాణ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కవిత
  • కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నంబర్ వన్ గా మారిందని వ్యాఖ్య
  • వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్న కవిత
Kavitha praises KCR
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. 'రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులేసిన తెలంగాణ నేడు సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంగా మారి సీఎం శ్రీ కేసీఆర్ గారి సారథ్యంలో ప్రగతిపథంలో పయనిస్తూ దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా మారింది. 

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను సన్మానిస్తూ, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ... జాతీయ సమైక్యత, సమగ్రత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం కేవలం కేసీఆర్ గారి విశాల దృక్పథం వల్లే సాధ్యమైంది' అని ఆమె ట్వీట్ చేశారు.