Diabetes: డయాబెటిస్ ఔషధం సితాగ్లిప్టిన్‌ను అతి తక్కువ ధరకే అందించాలని కేంద్రం నిర్ణయం

  • మధుమేహాన్ని నియంత్రించే సితాగ్లిఫ్టిన్ 
  • సితాగ్లిఫ్టిన్ 50 ఎంజీ పది మాత్రలను రూ. 60కే విక్రయించనున్న కేంద్రం
  • వీటితోపాటు సితాగ్లిఫ్టిన్ 100 ఎంపీ, సితాగ్లిఫ్టిన్, మెట్‌పార్మిన్ మిశ్రమ ట్యాబ్లెట్లు కూడా విక్రయం
  • ప్రధానమంత్రి జన ఔషధి మందుల దుకాణాల ద్వారా అందుబాటులోకి
Govt launches diabetes drug Sitagliptin and its combinations at Rs 60 per pack

డయాబెటిస్ ఔషధం ‘సితాగ్లిప్టిన్’ను అతి తక్కువ ధరకే అందించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి జన ఔషధి మందుల దుకాణాల ద్వారా వీటిని అందరికీ అందుబాటులో ఉంచాలని భావించిన కేంద్రం.. సితాగ్లిఫ్టిన్ 50 ఎంజీ 10 మాత్రలను కేవలం రూ. 60కే విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ తెలిపింది. సితాగ్లిఫ్టిన్ 50 ఎంజీతోపాటు సితాగ్లిఫ్టిన్ పాస్ఫేట్ 100 ఎంజీ మాత్రలను రూ. 100కు, సితాగ్లిఫ్టిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్ ట్యాబ్లెట్లు పదింటిని రూ.70కి విక్రయించనున్నట్టు కేంద్రం తెలిపింది.

ఇవే మాత్రలను ప్రముఖ బ్రాండ్లు రూ. 162-258 మధ్య విక్రయిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 8,700 ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన జనరిక్ మందులను విక్రయిస్తున్నట్టు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన సీఈవో రవి దధీచ్ తెలిపారు.

  • Loading...

More Telugu News