చైనాలో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 42 అంతస్తుల టెలికం భవనం: వీడియో ఇదిగో!
- హునాన్ ప్రావిన్స్ రాజధాని చంగ్సాలో ఘటన
- మంటలను అదుపు చేసిన 280 మంది అగ్నిమాపక సిబ్బంది
- సెల్‌ఫోన్ సర్వీసులకు అంతరాయం కలగలేదన్న టెలికం సంస్థ
- ఇబ్బందులు పడ్డామంటున్న యూజర్లు
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఎవరూ మరణించలేదని టెలికం సంస్థ తెలిపింది. ఈ ప్రమాదం కారణంగా సెల్‌ఫోన్ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపింది. అయితే, మొబైల్ యూజర్లు మాత్రం సర్వీసులు పనిచేయలేదని చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భవనం నుంచి దట్టంగా ఎగసిపడుతున్న పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడం, భవనం నుంచి శిథిలాలు కిందపడుతుండడం కొన్ని వీడియోల్లో ఉంటే.. భవనంలో చిక్కుకుపోయిన వర్కర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మరికొన్ని వీడియోల్లో ఉంది.