Venkatesh Iyer: మైదానంలో టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌‌కు తప్పిన పెను ప్రమాదం

Ambulance In Ground As Bowlers Wild Throw Hits Venkatesh Iyer
  • దులీప్ ట్రోఫీలో ఘటన
  • బౌలర్ చింతన్ గజా త్రోకు తీవ్రంగా గాయపడిన అయ్యర్
  • మైదానంలోకి అంబులెెన్స్, స్ట్రెచర్  
  • ఫిజియో ప్రథమ చికిత్సతో కోలుకున్న అయ్యర్
దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతున్న టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వెస్ట్‌జోన్-సెంట్రల్ జోన్ మధ్య నిన్న కోయంబత్తూరులో సెమీస్ రెండో రోజు ఆట కొనసాగింది. ఈ క్రమంలో వెస్ట్‌జోన్ బౌలర్ చింతన్ గజా ఓవర్‌లో 27 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్ సిక్సర్ కొట్టి ఖాతా తెరిచాడు. ఆ తర్వాతి బంతి చింతన్ వద్దకు వెళ్లడంతో అతడు వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా వెంకటేశ్ మెడను బలంగా తాకింది. అంతే, అయ్యర్ అక్కడే బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలాడు. 

వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజయో అతడిని పరీక్షించాడు. ఎందుకైనా మంచిదని ముుందు జాగ్రత్త చర్యగా మైదానంలోకి అంబులెన్స్, స్ట్రెచర్ కూడా తెప్పించారు. ఫిజియో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మైదానం వీడిన అయ్యర్.. నొప్పి నుంచి కాస్తంత ఉపశమనం లభించిన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, వ్యక్తిగత స్కోరు 14 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరాడు. అతడి స్కోరులో రెండు ఫోర్లు, సిక్సర్ ఉన్నాయి. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 257 పరుగులు చేసింది. సెంట్రల్ జోన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ నిన్న 130/3తో ఉంది. పృథ్వీషా సెంచరీ (104)తో నాటౌట్‌గా ఉన్నాడు.
Venkatesh Iyer
Team India
Duleep Trophy

More Telugu News