Gautam Adani: కుమారుడికి కీలక బాధ్యతలను అప్పగించిన గౌతం అదానీ

Gautam Adani son Karan takes key incharge
  • గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ
  • ఇటీవలే సిమెంట్ రంగంలోకి ప్రవేశించిన అదానీ
  • ఇప్పటికే అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కు సీఈవోగా ఉన్న కరణ్
ప్రపంచ కుబేరుల్లో గౌతమ్ అదానీ రెండో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మన దేశంలో అదానీ కంటే వేగంగా ఎదిగిన వ్యాపారవేత్త మరెవరూ లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా తన కుమారుడు కరణ్ అదానీకి గౌతమ్ అదానీ కీలక బాధ్యతలను అప్పగించారు. అదానీ గ్రూప్ ఇటీవలే సొంతం చేసుకున్న సిమెంట్ వ్యాపార బాధ్యతలను అతనికి అప్పగించారు. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే అదానీ గ్రూప్ సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది. అదానీ పెద్ద కుమారుడు కరణ్. ఇప్పటికే ఆయన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ కు సీఈవోగా ఉన్నారు.
Gautam Adani
Son
Karan

More Telugu News