K Kavitha: ఈడీ నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: కల్వకుంట్ల కవిత

  • ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం
  • కవితకు ఈడీ నోటీసులంటూ కథనాలు
  • అసత్య ప్రచారం అంటూ ఖండించిన కవిత
  • మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యలు
  • మీడియా వాస్తవాలను ప్రసారం చేయాలని హితవు
Kavitha clarifies no ED notice to her

ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు తెలుగు రాష్ట్రాల్లోనూ వినిపిస్తున్నాయి. ఈ స్కాంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు పంపించిందంటూ ఈ ఉదయం నుంచి కథనాలు వెల్లువెత్తాయి. దీనిపై కవిత సోషల్ మీడియాలో స్పందించారు. 

ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఈ వాస్తవాన్ని వెల్లడించడం ద్వారా టీవీ ప్రేక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఢిల్లీలో కూర్చుని దుష్ప్రచారం చేస్తున్న కొందరు వ్యక్తులు మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసే కంటే వాస్తవాలనే ప్రచారం చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా సంస్థలన్నింటిని కోరుతున్నానని కవిత హితవు పలికారు.

More Telugu News