KA Paul: గద్దర్ కు భారతరత్న ఇవ్వాలి: కేఏ పాల్ డిమాండ్

KA Paul demands Bharat Ratna to Gaddar
  • ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దయిందని అసత్య ప్రచారం చేస్తున్నారన్న కేఏ పాల్
  • తమ పార్టీకి సీఈసీ కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చిందని వివరణ
  • క్రైస్తవుల్లో ఐకమత్యం లోపించిందని వ్యాఖ్య
పలు పార్టీల గుర్తింపును ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో క్రియాశీలకంగా లేని పలు పార్టీలను జాబితా నుంచి తొలగించింది. ఈ క్రమంలో, కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ గుర్తింపు కూడా రద్దయిందనే ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో కేఏ పాల్ మాట్లాడుతూ తమ పార్టీ రద్దయిందనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చిందని... వాటికి త్వరలోనే సమాధానం పంపిస్తామని తెలిపారు. క్రైస్తవుల్లో ఐకమత్యం లోపించిందని, ఇతర పార్టీల నేతల వద్ద దేహీ అంటున్నారని విమర్శించారు. ముస్లింలంతా ఐకమత్యంగా ఎంఐఎంతో కలిసి ఉంటున్నారని చెప్పారు. 

బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని విమర్శించారు. వేల పాటలు రాసిన గద్దర్ శాంతి కోసం పాటుపడ్డారని, ఆయనను తాను శాంతిదూతగా అన్ని దేశాలకు తిప్పుతానని చెప్పారు. గద్దర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
KA Paul
Gaddar

More Telugu News