నేను మార్గదర్శిని కాను... నేర్చుకునే దశలోనే ఉన్నాను: రాజమౌళి

16-09-2022 Fri 13:08
  • బాహుబలి, ఆర్ఆర్ఆర్ లతో ప్రపంచస్థాయికి రాజమౌళి ఇమేజ్
  • ఇప్పటికీ తొలిమెట్టుపైనే ఉన్నానన్న రాజమౌళి
  • మూలాలను మర్చిపోలేదని వెల్లడి
Rajamouli at Toronto film festival
బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూజన్ చిత్రాలతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి ఘనంగా చాటిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి.... ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఖ్యాతిని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. 

రాజమౌళి కెనడాలో టొరంటో ఫిలిం ఫెస్టివల్ కు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ ఎంతటి విజయం సాధించినా, తాను దర్శకుడిగా ఇప్పటికీ తొలి మెట్టుపైనే ఉన్నానని వినమ్రంగా తెలిపారు. తాను మార్గదర్శిని అనుకోవడంలేదని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తాను మూలాలకు కట్టుబడి ఉన్నానని, తనను తాను నిత్యం చక్కదిద్దుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. 

ఇక, తనదైన టేకింగ్ తో హాలీవుడ్ తరహా సినిమా చేస్తే, రెండు పడవలపై కాళ్లు ఉంచి ప్రయాణం చేసినట్టే అవుతుందని రాజమౌళి వ్యాఖ్యానించారు. రాజమౌళి... మహేశ్ బాబుతో వరల్డ్ అడ్వెంచర్ స్టోరీతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.