KTR: కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మకు బదులు మోదీ బొమ్మ వేస్తారేమో: కేటీఆర్

Centre may order to print Modi photo on currency notes says KTR
  • అహ్మదాబాద్ లో ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును మోదీ మెడికల్ కాలేజీగా మార్చారన్న కేటీఆర్
  • ఇప్పటికే సర్దాల్ పటేల్ స్టేడియంకు మోదీ పేరు పెట్టారని విమర్శ
  • నోట్లపై మోదీ బొమ్మను ప్రింట్ చేయమని ఆదేశిస్తారేమోనని ఎద్దేవా
ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలను గుప్పించడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలంగాణ వరకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా ఏ చిన్న అవకాశం దొరికినా ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. తాజాగా మరోసారి బీజేపీపై ఆయన మండిపడ్డారు. 

గుజరాత్ అహ్మదాబాద్ లో ఉన్న ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో...  కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మకు బదులు మోదీ బొమ్మను ప్రింట్ చేయాలని ఆర్బీఐని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశిస్తారేమో అని ఎద్దేవా చేశారు.
KTR
TRS
Narendra Modi
BJP
Currency Notes

More Telugu News