అషురెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ లో రామ్ గోపాల్ వర్మ రచ్చ.. వీడియో ఇదిగో!

16-09-2022 Fri 10:03
  • నిన్న రాత్రి ఘనంగా అషురెడ్డి బర్త్ డే వేడుకలు
  • అషురెడ్డి చేత కేక్ కట్ చేయించిన ఆర్జీవీ
  • వేడుకకు హేమ, హరితేజ, మెహబూబ్ తదితరులు హాజరు
Ram Gopal Varma enjoying in Ashu Reddy birthday celebrations
ప్రముఖ ఇన్స్టాగ్రామర్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అషురెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ నిన్న రాత్రి ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రచ్చ చేశారు. తనదైన్ స్టయిల్ లో అషురెడ్డి చేతిని పట్టుకుని కేక్ కట్ చేయించి, ఆమెకు తినిపించారు. 

ఈ కార్యక్రమానికి సినీ నటి హేమ, హరితేజ, బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్, జబర్దస్త్ పవిత్ర తదితరులు కూడా హాజరయ్యారు. మరోవైపు అషురెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమె తండ్రి బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె బర్త్ డేకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.