ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో రెండు వీడియోలు విడుద‌ల చేసిన బీజేపీ.. వీడియోల్లో రామ‌చంద్ర పిళ్లై పేరు ప్ర‌స్తావ‌న‌

15-09-2022 Thu 19:51
  • ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ స్కాం
  • ఈ స్కాంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు పాత్ర ఉంద‌ని బీజేపీ ఆరోప‌ణ‌
  • తాజాగా విడుద‌లైన వీడియోల్లో పిళ్లై పేరు ప్ర‌స్తావ‌న‌
bjp releases two videos of delhi liquor scam sting operation
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు పాత్ర ఉందంటూ ఇటీవ‌లే బీజేపీకి చెందిన నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గురువారం ఈ కుంభ‌కోణానికి సంబంధించి స్టింగ్ ఆప‌రేష‌న్ల‌కు చెందిన రెండు వీడియోల‌ను బీజేపీ విడుద‌ల చేసింది. ఈ వీడియోల్లో తెలంగాణ‌కు చెందిన మ‌ద్యం వ్యాపారి అరుణ్ రామ‌చంద్ర పిళ్లై క‌నిపించారు. 

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం బ‌య‌ట ప‌డిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ వ్యవ‌హారంపై కేసు న‌మోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు ఇప్ప‌టికే రామ‌చంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాల‌యాల్లో సోదాలు చేసిన సంగ‌తి తెలిసిందే. పిళ్లైతో పాటు బోయిన్‌ప‌ల్లి అభిషేక్ రావు, సూదిని సృజ‌న్ ఇళ్లు, కార్యాల‌యాల‌పైనా ఈడీ సోదాలు చేసింది. తాజా వీడియోల్లో రామ‌చంద్ర‌పిళ్లై పేరు వినిపించ‌డం, లిక్క‌ర్ స్కాం జ‌రిగిన తీరుపై చ‌ర్చ‌లు జ‌రిగిన దృశ్యాలున్నాయి.