ఇండియా బ‌య‌లుదేరిన ఆస్ట్రేలియా జ‌ట్టు.. ఈ నెల 20 నుంచి టీ20 సీరిస్‌

15-09-2022 Thu 18:32
  • 3 మ్యాచ్‌ల‌తో కూడిన టీ20 సీరిస్‌
  • ఇరు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన రెండు దేశాల క్రికెట్ బోర్డులు
  • భార‌త్ బ‌య‌లుదేరిన‌ట్లు వెల్ల‌డించిన పాట్ క‌మ్మిన్స్‌
australia cricket team starts to india
టీమిండియాతో టీ20 సీరిస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు భార‌త్ బ‌య‌లుదేరింది. ఈ నెల 20 నుంచి మొద‌లు కానున్న ఈ సీరిస్‌లో భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య 3 టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 20న మొహాలీలో జ‌రిగే మ్యాచ్‌తో ప్రారంభం కానున్న ఈ సీరిస్.. ఈ నెల హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్‌తో ముగియ‌నుంది. ఈ నెల 23న నాగ్‌పూర్‌లో రెండో టీ20 జ‌ర‌గ‌నుంది. 

ఈ సీరిస్ కోసం ఇప్ప‌టికే టీమిండియా జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. అటువైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ఈ సీరిస్ కోసం జ‌ట్టును ప్ర‌కటించ‌గా... ఆ జ‌ట్టు స‌భ్యులు గురువారం భార‌త్ బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా భార‌త్‌కు బ‌య‌లుదేరిన విమానంలో త‌న ఫొటోను సెల్ఫీ తీసిన ఆసీస్ జ‌ట్టు ఆట‌గాడు పాట్ క‌మ్మిన్స్‌... తాము భార‌త్ బ‌య‌లుదేరామంటూ సోష‌ల్ మీడియాలో పేర్కొన్నాడు.