Telangana: బీజేపీ క‌రోనా కంటే ప్ర‌మాదకరం: సీపీఐ తెలంగాణ కార్య‌ద‌ర్శి కూనంనేని

cpi telangana secretary kunamneni comments on political alliances
  • ఇటీవ‌లే సీపీఐ తెలంగాణ కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన కూనంనేని
  • దేశంలో పొత్తులు పెట్టుకోని పార్టీలు లేవ‌ని వ్యాఖ్య 
  • సీపీఐ పొత్తుల‌పై ఏ ఒక్క‌రికీ అనుమానాలు అవ‌స‌రం లేద‌న్న నేత‌
సీపీఐ తెలంగాణ శాఖ కార్య‌ద‌ర్శిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కూనంనేని సాంబ‌శివ‌రావు రాజ‌కీయ పార్టీల పొత్తుల గురించి గురువారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో పొత్తులు పెట్టుకోని పార్టీ అంటూ ఏదీ లేద‌ని ఆయ‌న అన్నారు. సీపీఐ పార్టీ పొత్తుల గురించి ఏ ఒక్క‌రికీ అనుమానాలు అవ‌స‌రం లేద‌ని కూడా ఆయ‌న అన్నారు. 

ఈ సందర్భంగా బీజేపీపై కూనంనేని ఓ ఘాటు వ్యాఖ్య చేశారు. బీజేపీ క‌రోనా కంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ కార‌ణంగానే మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో తాము టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు. క‌మ్యూనిస్టులు లేకుండా ఏ పార్టీ ముందుకు వెళ్ల‌లేద‌న్న ఆయ‌న... తెలంగాణ చ‌రిత్ర‌లో సీఎం కేసీఆర్ చెప్పే ప్ర‌తి పేరు క‌మ్యూనిస్టుదేనన్నారు.
Telangana
CPI
Kunamneni Sambasivarao
BJP
TRS
Mubugode Bypoll

More Telugu News